
కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులలో విషాదం జరిగింది. గ్రామ సమీపంలోని కుందునదిలో ప్రసాద్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతనితో పాటు కొంతమంది కలిసి నది ఒడ్డున చింతపిక్కలాట ఆడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి రాగా… వారిని గమనించిన ప్రసాద్ పరుగెత్తి కుందునదిలో దూకాడు. ఎంత పిలిచినా పలకకపోవడం వల్ల.. యువకుడు మృతి చెందినట్లు పోలీసులు నిర్థరించారు. అతని మృతదేహం కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: నంద్యాల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి