Bopparaju Venkateswarlu : ఎనిమిదో తేదీ వచ్చినా ఇప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదని.. ప్రతి నెలా ఏ రోజున జీతాలు చెల్లిస్తారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 జూలై నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఏపీ జేఏసీ అమరావతి మహాసభలు కర్నూలులో నిర్వహించనున్నట్లు తెలిపారు.
"ఈ రోజు అంటే 8వ తేదీ వరకు ఉద్యోగులకు రావాల్సిన దాదాపు 2వేల కోట్ల రూపాయల జీతాలు, పెన్షన్లు అందలేదు. రాబోయే రోజుల్లో బకాయి కూడా పడుతుందేమోననే అనుమానం వస్తోంది." -బొప్పరావు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇవీ చదవండి: