ETV Bharat / state

మంత్రాలయం పుష్కర ఘాట్ల​ నిర్మాణాల్లో అవినీతి: భాజపా - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో పుష్కర ఘాట్ల​ నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్తున్న భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భాజపా నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఘాట్ల​ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని, ఆ అవినీతి బయటపడుతుందనే భాజపా నేతలను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత పురుషోత్తంరెడ్డి ఆరోపించారు.

Bjp leaders
Bjp leaders
author img

By

Published : Nov 23, 2020, 3:29 PM IST

పుష్కరఘాట్ల పరిశీలనకు వెళ్తున్న భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో అవినీతిని జరిగిందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. పుష్కర ఘాట్​ను పరిశీలించేందుకు ఇంజినీరుతో సహా వెళ్తున్న భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల చర్యతో భాజపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. పోలీసు రాజ్యంలో ఉన్నామా అని పురుషోత్తంరెడ్డి ప్రశ్నించారు. పుష్కర ఘాట్ల​ను పరిశీలించేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. ఘాట్​ నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టే వరకూ భాజపా పోరాటం చేస్తుందన్నారు.

ఇదీ చదవండి : పెద్దవడుగూరులో తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.