ETV Bharat / state

'శిల్పా చక్రపాణిరెడ్డి ప్రోత్సాహంతోనే శ్రీశైలం దేవస్థానంలో అవినీతి'

author img

By

Published : Jun 20, 2020, 7:53 PM IST

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతిపై లోతుగా విచారణ చేస్తే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మొదటి ముద్దాయిగా దొరికిపోతారని భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దేవస్థానంలో అవినీతి జరుగుతోందన్నారు.

'ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రోత్సాహంతోనే శ్రీశైలం దేవస్థానంలో అవినీతి'

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రోత్సాహంతోనే శ్రీశైలం దేవస్థానంలో అవినీతి జరుగుతోందని నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ భాజపా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. దేవస్థానంలో జరిగిన అవినీతిపై లోతుగా విచారణ చేస్తే శిల్పా చక్రపాణి రెడ్డి మొదటి ముద్దాయిగా దొరికిపోతారని వ్యాఖ్యానించారు. ఏజెన్సీలు, అనుచరులను అడ్డం పెట్టుకొని దోపిడి దందా కొనసాగిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

సీబీఐ విచారణ జరిపించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చక్రపాణిరెడ్డిని కోరారు. శ్రీశైల దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు భాజపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన అధికారుల ఆస్తులు అమ్మైనా దేవస్థానం నష్టాన్ని పూడ్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.