పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల.. ఆటోఛార్జీలకూ రెక్కలొచ్చాయి. సామాన్యులపై పెనుభారం పడుతోంది. నిత్యవసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకటంతో..మధ్యతరగతి కుటుంబాలకు బతుకే భారమైపోయింది.
కర్నూలులో సుమారు 25 వేల ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం సిటీ బస్సులు లేక.. వేల మంది పేద, మధ్య తరగతి, కూలీలు, విద్యార్థులు.. ఆటోలనే ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో లింక్ ఆటోల్లో 15 రూపాయలు వసూలు చేసేవారు. పెట్రో, డీజిల్ రేట్లు..సెంచరీకి చేరటంతో ఆటో యూనియన్లు ఛార్జీలను పెంచేశాయి.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటోను మాట్లాడుకుంటే.. డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే..పెట్రో, డీజిల్ రేట్లు పెరగటం వల్ల..గిట్టుబాటు కావటం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. పెట్రో, డీజిల్ ధరలు దిగొస్తే ఆటో ఛార్జీలతోపాటు..నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయని ప్రజలు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు.
ఇదీచదవండి: ఔరా: మూడు టన్నుల పాత ఐరన్ స్క్రాప్‌తో 'జీపు' తయారీ