కర్నూలులో సుమారు 20వేల మంది ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కర్ఫ్యూ ఆంక్షల వల్ల వాహనాలు తిరిగేందుకు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే అనుమతి ఉంది. ప్రజలెవరూ ఆటోలు ఎక్కట్లేదని... రోజుకు వంద, రెండొందలు మాత్రమే వస్తున్నాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. పెట్రో ధరలు, పోలీసుల చలాన్లకే వచ్చిన ఆ అరకొర ఆదాయం సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఆటోలను అద్దెకు తీసుకునేవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. అద్దెలు తలకు మించిన భారమవుతున్నాయని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటోవాలాలు కోరుతున్నారు.
ఇదీచదవండి.