కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్లలో కర్నాటక పోలీసులపై దాడి చేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా విడపనూరుకు చెందిన పోలీసులు.. ఓ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు మఫ్టీలో కడివెళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాళ్లపై దాడి చేయగా.. ఓ పోలీస్ తలకు గాయమైంది. గాయపడ్డ అధికారికి ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం రాయచూరు కు తీసుకెళ్లారు. అయితే కర్ణాటక పోలీసులు స్థానిక గ్రామీణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు తెలిసింది.
ఇదీ చదవండి..