కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో నేటి నుంచి ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. గర్భాలయ ప్రవేశం మినహా... భక్తుల కోసం అన్నీ రకాల ఆర్జిత సేవలు జరగనున్నాయి. మహానందిలోని మహానందీశ్వర స్వామి... ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు దర్శనమివ్వనున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి... సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, కల్యాణాలు, ఏకాంత సేవలు జరగనున్నాయి.
ఇదీ చదవండీ... చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు