కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో చెత్తకు పెట్టిన నిప్పు వలన నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. చెత్తలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వస్తువులు అంటుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు వల్ల పక్కన ఆడుకుంటున్న అంగన్వాడీ చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను తల్లిదండ్రులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులకు వైద్యులు చికిత్స అందించారు. చిన్నారులను తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు గ్రామీణ సీఐ మహేశ్వరరెడ్డి పరామర్శించారు.
ఇదీ చదవండి : చిల్లకల్లులో టిప్పర్, బైకు ఢీ.. ఒకరికి గాయాలు