కర్నూలు జిల్లా గూడూరు మండలం నెరవాడ గ్రామ సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వక్కెరవాగులో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. చంద్రశేఖర్ అనే ఇంటర్ విద్యార్థి ఉదయం వాగు దాటుతూ నీళ్లలో గల్లంతయ్యాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కళ్లెదుటే విద్యార్థి కొట్టుకుపోయాడు. అక్కడ జనాలు ఉన్నా వాగు ఉద్ధృతికి ఎవరూ కాపాడలేకపోయారు. విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి. సంజీవయ్య సాగర్‌కు భారీగా వరదనీరు..