ETV Bharat / state

కొనడానికి రూ.6 కోట్లు వెచ్చించారు.. లెక్కల్లో 28 లక్షలు చూపారు..!

PIPES: తుంగభద్ర పుష్కరాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పైపులు కొన్నారు. 12 రోజుల తర్వాత .. వాటిని ఓ పార్కులో నిల్వ చేశారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంతో అవి కాలిపోయాయి. కోట్ల రూపాయల విలువైన పైపులు కాలిపోతే.. కేవలం 28 లక్షలే నష్టం జరిగిందని అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారపార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ప్రజాసంఘాలు మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి.

PIPES
పైపుల చుట్టూ ఆరోపణలు.. అధికారులు, నేతలు కుమ్మక్కైయ్యారన్న ప్రజా సంఘాలు
author img

By

Published : Jun 29, 2022, 1:44 PM IST

PIPES: కర్నూలు జిల్లాలో 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన పుష్కరాల కోసం.. ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది. మునగాలపాడు, పంప్‌హౌస్‌, సంకల్‌ బాగ్‌, నాగసాయిబాబా గుడి, సాయిబాబా గుడి, నాగరేశ్వరస్వామి ఆలయం, రాఘవేంద్రస్వామి మఠం, రాంబొట్ల దేవాలయం వద్ద పుష్కర స్నానాల కోసం తుంగభద్ర నది ఒడ్డున ఘాట్లు నిర్మించారు.

పైపుల చుట్టూ ఆరోపణలు.. అధికారులు, నేతలు కుమ్మక్కైయ్యారన్న ప్రజా సంఘాలు

ఈ సందర్భంగా తుంగభద్ర నదిలో మురుగునీరు కలవకుండా.. 6 కోట్ల రూపాయల విలువైన పైపులు కొనుగోలు చేశారు. పుష్కరాల అనంతరం ఆ పైపులను వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని మున్సిపల్‌ పార్కులో భద్రపరిచారు. ఇటీవలే అగ్నిప్రమాదం జరగటంతో.. పైపులన్నీ పూర్తిగా కాలిపోగా.. వాటి విలువ కేవలం 28 లక్షల రూపాయలేనని.. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మధ్యనే కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పైపుల విషయంపై తీవ్రమైన చర్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు మేయర్ సహా అధికారులను నిలదీశారు. 12వ వార్డు కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. మరికొందరు కార్పొరేటర్లు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే.. విజిలెన్స్‌ విచారణ వద్దని, అంతర్గత విచారణ చేపడతామని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చెప్పగా.. దానికి మేయర్‌ సరేనన్నారు.

అయితే.. విజిలెన్స్‌ విచారణ కాకుండా కమిషనర్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామనటంపై.. ప్రజాసంఘాలు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు, నేతలు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

తుంగభద్ర పుష్కరాల కోసం మంజూరు చేసిన 30 కోట్ల రూపాయల విషయంలోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపైనా విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.