ప్రతిపక్షంలో ఉన్న తాము రైతుల కష్టాలపై గళమెత్తితే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు, రైతుల కోసం తాము నిరసన ప్రదర్శనలు చేస్తే పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆక్షేపించారు.
ప్రభుత్వ పథకాలు పొందాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందని విమర్శించారు. పథకాల మంజూరులో పారదర్శకత ఉందని ఓ వైపు ముఖ్యమంత్రి అంటున్నా...క్షేత్రస్థాయిలో మాత్రం ఇది వాస్తవం కాదన్నారు.