కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఎండాకాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నెట్టేకల్, సలకలకొండ, బైచేగేరీ గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వారం రోజులకు ఒకసారి తాగునీరు తమకు తాగునీరు వస్తుందని గ్రామస్థులు వాపోయారు. అది కూడా 6 బిందెల నీరు మాత్రమే అందుతోందని.. వాటితోనే తమ కుటుంబం గడపాల్సి వస్తుందంటున్నారు. నీటి సరఫరా సక్రమంగా ఇస్తే తాము గుమిగూడకుండా ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేయాలని కోరారు.
ఇదీ చదవండి: