కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్డీవో బాలగణేశయ్య సాధారణ వ్యక్తిగా వెళ్లి కూరగాయలు తీసుకున్నారు. పట్టణంలోని పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు చేస్తున్నారో లేదో తెలుసుకోవటానికి పంచె కట్టులో వచ్చి కూరగాయలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. 2 దుకాణాల్లో మిరపకాయలు కిలోకు ఐదు రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని... అడిగితే జవారీ ధరలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారని అన్నారు. మిగతా ధరల్లో తేడా లేదని ఆర్డీఓ చెప్పారు.
ఇదీ చూడండి: