కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని సంజామల తహశీల్దార్ గోవింద్ సింగ్.. అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. జక్కా ఓబులమ్మ అనే మహిళకు చెందిన పాస్ పుస్తకాన్ని మార్చేందుకు గాను ఐదు వేల రూపాయల లంచం అడగగా... బాధితురాలు అనిశాను ఆశ్రయించారు. ఓబులమ్మ కుమారుడు రామేశ్వరరెడ్డి తహశీల్దార్ గోవింద్ సింగ్‌కు ఐదు వేల రూపాయలు ఇస్తున్న సమయంలో.. రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నట్లు అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. విచారణ చేపట్టి నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.
ఇదీ చూడండి: