ఆదోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు జరిగాయి. రైతు గోవిందరాజులు నుంచి వీఆర్వో మల్లికార్జున రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇటీవలే గోవందరాజు తండ్రి మృతి చెందడం వల్ల తమ పేరుపై పట్టా మార్చాలని కోరడం వల్ల వీఆర్వో రూ.40 వేలు డిమాండ్ చేశాడని ఆయన తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేక అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశానని రైతు తెలిపాడు. నిందితుడు మల్లికార్జునపై విచారణ ప్రారంభించినట్టు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు.
ఇదీ చదవండి :