కర్నూలు జిల్లా ఆదోనిలోని అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. 16 వేలు లంచం తీసుకుంటూ..ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేష్ పట్టుబడ్డారు. బొగ్గు బట్టీల అనుమతి కోసం పత్తికొండకు చెందిన వ్యాపారులు వెంకటేష్ ను అనుమతి కోరగా...అతను లంచం కావాలని డిమాండ్ చేయటంతో వారు అనిశా అధికారులకు సమాచారం ఇచ్చారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని అనిశా డీఎస్పీ జయరామరాజు తెలిపారు.
ఇవి చదవండి...దారిమళ్లిన మరుగుదొడ్ల నిధులు.. అధికారిపై చర్యలు