కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యవేక్షణకు వచ్చిన డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఎదుట... ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెను పత్తికొండకు చెందిన జహీనాబీ గా గుర్తించారు.
తన కుమారుడు ఓ ప్రేమ జంటకు సహకరించాడన్న ఆరోపణతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. జహీనాబీ ఆరోపించింది. ఆ వేధింపులు తట్టుకోలేకే బలవన్మరణానికి యత్నించినట్టు స్థానికులు తెలిపారు. ఆమెకు కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:
ADIMULAPU SURESH: మంత్రి సురేశ్ అనంత పర్యటన.. అడ్డగింతకు విద్యార్థినేతల యత్నం