ETV Bharat / state

గుమ్మనూరు పేకాట ఘటన విచారణ సీబీఐకి ఇవ్వండి... హైకోర్టులో పిటిషన్

కర్నూలు జిల్లా గుమ్మనూరు పేకాట ఘటనపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పురుషోత్తంరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. పేకాట స్థావరాల తనిఖీలకు వెళ్లిన పోలీసులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. ఈ దాడి వెనుక రాజకీయ నేతలు ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు సరిగా జరగట్లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

high court
high court
author img

By

Published : Nov 19, 2020, 3:13 PM IST

Updated : Nov 19, 2020, 7:33 PM IST

కర్నూలు జిల్లా గుమ్మనూరులో పేకాట శిబిరంపై దాడి ఘటనపై నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరుతూ పురుషోత్తమ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశారని పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పోలీసులపై దాడి చేసిన ఘటనపై చిప్పగిరి పోలీసు స్టేషన్​లో ఎఫ్ఐఆర్ 137/2020 నమోదైంది.

ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగట్లేదని ..దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని ధర్మాసనాన్ని పిటీషినర్ కోరారు. పేకాట శిబిరం నిర్వహణ వెనుక రాజకీయనేతలున్నారని పిటీషనర్ న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్​లో మంత్రి గుమ్మనూరు జయరాంను కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు.

అసలేం జరిగింది...?

ఈ ఏడాది ఆగస్టులో .... కార్మిఖశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం గుమ్మనూరులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు. పేకాట స్థావరానికి వెళ్లిన పోలీసులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సమీర్ బాషాకు గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి కొందరిని పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు.

ఇదీ చదవండి : సీఎం జగన్ స్థానిక ఎన్నికలు జరగనివ్వరు: జేసీ దివాకర్ రెడ్డి

Last Updated : Nov 19, 2020, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.