ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో లక్ష్మీదేవి(20) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన లక్ష్మీదేవిని 14 నెలల క్రితం బాచేపల్లికి చెందిన చిన్నదస్తగిరికి ఇచ్చి వివాహం చేశారు. దస్తగిరికి అది రెండో వివాహం. పెళ్లైన తర్వాత తన భార్యను... దస్తగిరి కుటుంబసభ్యులతో కలిసి వేధించినట్టు లక్ష్మీదేవి బంధువులు ఆరోపించారు. మృతురాలికి నాలుగున్నర నెలల కుమారుడు ఉన్నాడు. ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: