కర్నూలు జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో ఐదుగురు విలేకరులపై హత్యాయత్నం జరగింది. మండలానికి చెందిన కేశవయ్య, హనీఫ్, ఓబులేసు, మధు, పుల్లయ్య అనే ఐదుగురు వివిధ వార్తా పత్రికల్లో విలేకరులుగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లి గ్రామంలో జరుగుతున్న తిరుణాళ్లకు మిత్రుల ఆహ్వానం మేరకు విందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా దొర్నిపాడు మండలం భాగ్య నగరం గ్రామానికి చెందిన రాఘవరెడ్డి అనే వ్యక్తి .. కేశవయ్యను తన కారులో ఎక్కించుకున్నాడు. దారిలో గొడవపడ్డాడు.
రాఘవ రెడ్డి నేరుగా దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విలేకరులను స్టేషన్కు పిలిపించి.. ఇరువురికి రాజీ కుదిర్చి పంపించారు. అనంతరం... ఐదుగురు విలేకరులు పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై ఉండగా...రాఘవరెడ్డి కారుతో వేగంగా వెళ్లి వారిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: