కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి(tdp leader kotla suryaprakash) ఇంటి వద్ద ఓ తాగుబోతు వీరంగం చేశాడు. శుక్రవారం రాత్రి.. కర్నూలు జిల్లా లద్దగిరిలోని సూర్యప్రకాశ్‌రెడ్డి ఇంటి వద్దకు వచ్చిన తాగుబోతూ..చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అప్రమత్తమైన కోట్ల అనుచరులు బెదిరింపులకు(blackmail to tdp leader kotla) పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అతడిని కోడుమూరు మండలం అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్నగా గుర్తించారు. అధికార పార్టీ నేతలు..అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.