sheeps dead: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లెలో కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రమేష్ ఇంటి సమీపంలో గొర్రెలను పెంచుతున్నాడు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి.. తాను ఇంటికి వెళ్లిన తర్వాత.. కుక్కలు గొర్రెలపై దాడి చేశాయని రమేష్ వాపోయాడు. దాడిలో సుమారు 5 లక్షల రూపాయల విలువైన 50 గొర్రెలు మృతి చెందాయని.. మరికొన్నిటికి గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చదవండి: