ETV Bharat / state

తుంగభద్ర టూ శ్రీశైలం.. వరద ఎంతో తెలుసా? - ap latest news

TUNGABHADRA DAM: ఈ ఏడాది తుంగభద్ర నుంచి శ్రీశైలం జలశయానికి ఇప్పటికే.. 201 టీఎంసీలు వచ్చాయి. ఆగస్టు రెండో వారంనాటికే ఇంత మొత్తంలో వరద రావడం అత్యంత అరుదు అని అధికారులు చెబుతున్నారు.

TUNGABHADRA DAM
TUNGABHADRA DAM
author img

By

Published : Aug 12, 2022, 12:14 PM IST

TUNGABHADRA: తుంగభద్ర నుంచి ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలశయానికి 201 టీఎంసీలు వచ్చాయి. ఆగస్టు రెండో వారంనాటికే తుంగభద్ర వాటా ఏకంగా 200 టీఎంసీలు దాటడం అత్యంత అరుదు. మరోవైపు ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా నది నుంచి గురువారం ఉదయం వరకు 66 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. ప్రకాశం బ్యారేజి నుంచి ఆగస్టు రెండో వారానికే 66 టీఎంసీలను సముద్రంలోకి వదిలేయడం గమనార్హం. గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి 72,880 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం గేట్లు జులై చివర్లోనే ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలో ఎగువన అనేక చోట్ల జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఎక్కడికక్కడ గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఆలమట్టి నుంచి గురువారం సాయంత్రానికి 2లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 2,16,850, జూరాలనుంచి 2,22,634 క్యూసెక్కుల ప్రవాహాలు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి 1,62,998 క్యూసెక్కుల ప్రవాహాలను వదులుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు.

శ్రీశైలం పదిగేట్ల ఎత్తివేత : శ్రీశైలం జలాశయం పది రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి 3,76,670 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,194 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రం ఆరింటికి 884.40 అడుగులు, నీటి నిల్వ 211.9572 టీఎంసీలుగా నమోదైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.