ETV Bharat / state

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై విచారణ సోమవారానికి వాయిదా - జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ

జడ్పీటిసీ, ఎంపీటీసి ఎన్నికల విషయంలో హైకోర్టులో తెదేపా,భాజపా, జనసేన దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ సోమవారానికి వాయిదా పడ్డాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు .

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై విచారణ సోమవారానికి వాయిదా

author img

By

Published : May 1, 2021, 2:16 AM IST

రాష్ట్రంలో జడ్పీటిసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో హైకోర్టులో తెలుగుదేశం, భాజపా, జనసేన దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ.. సోమవారానికి వాయిదా పడింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యంపై ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ..ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, భాజపా, జన సేన దాఖలు చేసిన వ్యాజ్యాలు శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. విచారణ సాధ్యం కాకపోవడంతో న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు.

ఇవీ చదవండి

రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.