రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విరుచుకుపడ్డారు. కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరం శ్మశానవాటికకు నిన్న ఒక్క రోజునే అంత్యక్రియల నిమిత్తం 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా మరణాలపై వాస్తవాలు దాచిపెడుతున్నట్లు దీంతో అర్థమవుతోందని చెప్పారు.
వ్యాక్సిన్ కోసం జనం ఇబ్బంది పడుతుంటే.. తనపై, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. ప్రశ్నించిన వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తనకు వందకుపైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: