ETV Bharat / state

'చంద్రబాబు ప్రోద్బలంతోనే తెదేపా నాయకులు దాడులు చేస్తున్నారు' - వైకాపా నేత మోకా భాస్కర్​రావు హత్య

వైకాపా నేత మోకా భాస్కర్​రావు హత్య వెనుక మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ విజయవాడలో ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే వైకాపా నేతలపై... తెదేపా నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.అచ్చెన్నాయుడు దోచుకున్న అవినీతి సొమ్ములో చంద్రబాబు, లోకేశ్​​కు కూడా వాటా వుందని ఆరోపించారు.

మోకా భాస్కర్​రావు హత్యపై ఎమ్మెల్యే జోగి రమేష్ సమావేశం

author img

By

Published : Jul 3, 2020, 5:50 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేత మోకా భాస్కర్​రావు హత్యకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుట్ర చేశారని ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. వెంటనే కొల్లు రవీంద్రపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మచిలీపట్నంలో బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్ రావును హత్య చేయించారని ఆక్షేపించారు. బలహీన వర్గాల నాయకులను అణచివేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారంటూ కాల్వ శ్రీనివాసులు అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రూ.151 కోట్లు అవినీతి చేసిన అచ్చెన్నాయుడిని అరెస్ట్​ చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దోచుకున్న అవినీతి సొమ్ములో చంద్రబాబు, లోకేశ్​​కు కూడా వాటా వుందని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం... దాని ద్వారానే వారికి జీతాలు ఇవ్వడం అద్భుతమని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. తెదేపా ప్రభుత్వంలో అడ్డగోలుగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వందల కోట్లు తినేశాయని..దీనికి సీఎం అడ్డుకట్ట వేశారన్నారు.

ఇదీ చూడండి. రఘురామకృష్ణరాజుపై లోక్​సభ స్పీకర్​కు వైకాపా ఫిర్యాదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.