కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ వైకాపా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి జోజిబాబు.. ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. పక్కనే ఉన్నవారు అడ్డుకున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. ఆయన ప్రధాన అనుచరులు వేదింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపించాడు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని.. అలాంటి తనను ఎమ్మెల్యే వంశీ, పార్టీ నేత కోట్లు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దళితులకు రావాల్సిన కాంట్రాక్టు పనుల్ని అడ్డుకోవడంతో పాటు.. బిల్లులు కూడా చెల్లించవద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని జోజిబాబు ఆరోపించారు.
ఇవీ చూడండి...