ETV Bharat / state

నలుగురిలో ఆ ఇద్దరు ఎవరో..? షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలపై పోస్టుమార్టం పనిలో వైఎస్సార్సీపీ - ఏపీ ముఖ్యవార్తలు

A shock to the YSR party : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి సొంత ఎమ్మెల్యేలే షాక్‌ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా.. టీడీపీ అభ్యర్థి అనురాధకు మొత్తం 23 ఓట్లు రావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. టీడీపీ అభ్యర్థికి ఓటేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై చర్చ సాగుతోంది.

వైఎస్సార్ పార్టీకి షాక్‌
వైఎస్సార్ పార్టీకి షాక్‌
author img

By

Published : Mar 24, 2023, 11:59 AM IST

Updated : Mar 24, 2023, 12:05 PM IST

A shock to the YSR party : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి సొంత ఎమ్మెల్యేలే మొండి చేయి చూపారు. తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేసి ఘన విజయం కట్టబెట్టారు. ఏడు స్థానాలూ గెలుస్తామని ధీమాతో బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ చివరకు ఆరు స్థానాలకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా అనురాధకు మొత్తం 23 ఓట్లు రావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. టీడీపీ అభ్యర్థికి ఓటేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై చర్చ సాగుతోంది.

ఏడు స్థానాలకు ఎన్నిక... ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా... వైఎస్సార్సీపీ నుంచి ఐదుగురు, తెలుగుదేశం నుంచి ఒకరు తొలి ప్రాధాన్యతా ఓట్లతోనే విజయం సాధించారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయేలు, పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, పోతుల సునీతకు 22 ఓట్లు చొప్పున లభించాయి. తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు 21 ఓట్ల చొప్పున రాగా రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. తెలుగుదేశం నుంచి రెండో ప్రాధాన్యత ఒకటి పడటంతో వెంకటరమణ గెలిచారు. విజేతలకు రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి ధ్రువపత్రాలు అందజేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా వారిలో నలుగురు అనధికారికంగా వైఎస్సార్సీపీ పంచన చేరారు. ఫలితంగా తెలుగుదేశానికి 19 మంది శాసనసభ్యులే మిగిలినా... వీరిలోనూ కొందరికి అధికార పార్టీ వల విసిరింది. సాధ్యమైనంత వరకు ఓటింగ్‌ లేకుండా చూడాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎంతమందిని గెలిపించారో.. అవే 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపొందారు.

ఈ విజయం చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది. తెలుగుదేశం కుటుంబ సభ్యుల విజయం ఇది. అందరికీ ధన్యవాదాలు. - పంచుమర్తి అనురాధ. ఎమ్మెల్సీ విజేత

ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలంతా ఈ ప్రభుత్వానికి బైబై చెప్పారు. తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సాక్షిగా బైబై జగన్ అన్న తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. - నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే

ఆ నలుగురు ఎవరని... అధికార పార్టీ నుంచి తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసిన వారు ఎవరనే అంశంపై... ఆసక్తి నెలకొంది. వీరిలో ఇద్దరి విషయంలో అవగాహన ఉన్నప్పటికీ.. మిగిలిన ఇద్దరు ఎవరన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఎవరు ఓట్లేయటం ద్వారా విజయం చేకూరిందన్న దానిపై తెలుగుదేశం పార్టీకి అవగాహన ఉంది. అయితే, బాహాటంగా చెప్పడానికి ఆ పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. రాజకీయ ఎత్తుగడల్లో లోపాలతో నష్టపోయామని భావిస్తున్న వైఎస్సార్సీపీ ఫలితమొచ్చినప్పటి నుంచి ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. చివరికి నిబంధనలు అంగీకరించకపోయినా రివిజన్‌ పేరుతో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలట్‌ పత్రాలను నిశితంగా పరిశీలించింది. చివరికి ఒక అవగాహనకు వచ్చినట్లుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన తేటతెల్లం చేస్తోంది.

మరో ఇద్దరూ అసంతృప్తులేనా.. నెల్లూరు రూరల్‌ వైఎస్సార్సీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓటేసినట్లు ప్రకటించారు. తెలుగుదేశం అభ్యర్థి గెలిచిన వెంటనే శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నెల్లూరులో వారి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. దీంతో శ్రీధర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటేసి ఉంటారని భావిస్తున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్థానంలో వైఎస్సార్సీపీ బాధ్యుడిగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల పార్టీ నియమించింది. ఆనంను అసలు పార్టీలోనే లేనట్లు వైఎస్సార్సీపీ పరిగణిస్తోంది. తాజా ఎన్నికల్లో ఓటు కోసం.. ఆయన్ను పార్టీ సంప్రదించలేదు. ఫలితంగా ఆనం సైతం.. ఆత్మప్రబోధానుసారం ఓటేసి ఉంటారని భావిస్తున్నారు.

ఆ ఒక్కటి తప్ప... నెల్లూరు జిల్లాకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం లేదని... ఇటీవల జగన్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే అడిగిన కొన్ని పనులు కూడా చేయలేదని చివరికి ఆయన కుటుంబసభ్యులు ఒకరికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి అడిగినా ఇవ్వలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన తెలుగుదేశంకు ఓటేస్తారేమోనన్న సందేహంతో ఆ జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్న మాజీమంత్రి ఒకరు బుధవారం ఆయన్ను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు కూడా పోటీకి అవకాశం ఇవ్వలేనని., ఇంకేదైనా పనులుంటే చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఆ ఎమ్మెల్యేను వైఎస్సార్సీపీ అభ్యర్థి.. జయమంగళ వెంకటరమణకు కేటాయించారు. ఆయనకు తొలి ప్రాధాన్యం కింద 22కు గాను ఒక ఓటు తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేపైనే అగ్రనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా చైతన్యవంతమైన కోస్తా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైతం రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం సాధ్యం కాదని అగ్రనేతలు ఇటీవల తేల్చిచెప్పారు. ఆయన ఓటింగ్ కు ముందు కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా టికెట్‌ ఇవ్వలేనని చెప్పినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యేను కోలా గురువులుకు కేటాయించగా... తొలి ప్రాధాన్యం 22 ఓట్లకు గాను ఒకటి తగ్గడంతో ఆ ఎమ్మెల్యేనూ సందేహిస్తున్నారు.

వైఎస్సార్ పార్టీకి షాక్‌

ఇవీ చదవండి :

Last Updated : Mar 24, 2023, 12:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.