కృష్ణా జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన 8 మంది యువకులు జూపూడి పుష్కర ఘాట్ పాయి లో సరదాగా ఈతకు దిగారు. ఏడుగురు యువకులు సురక్షితంగా బయటకు రాగా.. పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన మార్కపుడి వెంకట్ (17) గల్లంతయ్యాడు.
కొద్ది సేపటికి అతన్ని గుర్తించగా.. అప్పటికే మృతి చెందాడు.మృతుడు వెంకట్ విజయవాడ ప్రభుత్వ ఐటీఐలో ద్వితీయ సంవత్సరం విద్యార్థి అని అతని స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: