ప్రజా సంకల్పయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గాపురం, సీతన్న పేట ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు పాదయాత్ర నిర్వహించారు. వార్డు స్ధాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయనే దానిపై నేరుగా ప్రజలతో మాట్లాడి తెలుసుకోవటానికే ఈ నాడు నేడు కార్యక్రమం చేపడుతున్నామని మల్లాది విష్ణు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ నెలలో 596 కొత్త పెన్షన్ అందించామని...పేద ప్రజలకు ఉచితంగా 30 వేల ఇళ్ల పట్టాలు అందించనున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తామ ప్రభుత్వం ప్రజలలోకి పాదయాత్రల ద్వారా దైర్యం గా వెళుతున్నామని ఎమ్మెల్యే విష్ణు చెప్పారు.
ఇదీ చదవండి: