రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను వైకాపా నేతలు కలిశారు. వైకాపా నేతలు ఈ మేరకు తగు ఆధారాలతో లేఖ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లపై ఎన్నికల కమిషన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనను ఆధారంగా చూపించారు. 652 జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా 1866 నామినేషన్లు దాఖలు చేయగా.. తెలుగు దేశం పార్టీ 1413 నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. 9696 స్థానాల్లో ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 23 వేల 121 , తెదేపా 18 వేల 242 నామినేషన్లు దాఖలు చేశారని లేఖలో ఈసీకి తెలిపారు. గతంలో కంటే ఎక్కువే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపిన వైకాపా నేతలు చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు..
ఇదీ చూడండి స్థానిక ఎన్నికల పరిస్థితిపై అమిత్ షాకు కన్నా లేఖ