రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ చీలిపోవడం ఖాయమని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా నూరుశాతం స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 31లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.