విజయవాడ బస్టాండ్ ఆవరణలోని ఆలయంలో సీతమ్మ విగ్రహ ధ్వంసం బాధాకరమని వైకాపా నాయకులు దేవినేని అవినాష్ అన్నారు. పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టి ఘటనకు బాధ్యులను తప్పకుండా అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటారన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనుక తెదేపా నాయకులున్నారని అవినాష్ ఆరోపించారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో వైకాపా ప్రభుత్వం దూసుకుపోతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెదేపాలో చోటా మోటా నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆలయం టీఎన్టీయూసీ ఆధీనంలో ఉందని.. తెదేపా నాయకుల అధీనంలో ఉన్న అలయాల్లోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నారని.. ఆలయాలపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'దోషుల్ని పట్టుకోవడం చేతకాకపోతే.. సీఎం రాజీనామా చేయాలి'