ETV Bharat / state

టాలీవుడ్ నటులను ప్రచార బరిలోకి దింపిన వైకాపా - prudhvi

పోలింగ్ సమయం దగ్గరపడుతున్నందున వైకాపా జోరు పెంచింది. టాలీవుడ్ నటులతో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ఆలీ, ప్వథ్వీ
author img

By

Published : Apr 1, 2019, 6:47 AM IST

ఫ్యాను ప్రచార జోరు
ఎన్నికల ప్రచార పర్వానికి తక్కువ సమయమే ఉన్నందున వైకాపా జోరు పెంచింది. అభ్యర్థుల తరఫున సినీ తారలను ప్రచారంలోకి దింపింది.విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైకాపా తరఫున హాస్య నటుడు పృథ్వీ ప్రచారం చేశారు. నాతవరంలో రోడ్​షో నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం దగ్గర పడిందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలనే చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. ఆయనతోపాటు మరో హాస్యనటుడు జోగి నాయుడు ఈ ప్రచారంలో పాల్గొన్నారుకృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెంలో సినీతారలు జయసుధ, రాజారవీంద్రల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీను గెలిపించాలని కోరారు.అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ వైకాపా వెంకట్రామిరెడ్డి నిర్వహించిన రోడ్​షోలో నటుడు ఆలీ సందడి చేశారు. ఆలూరు రోడ్ పోర్టర్ లైన్​లోని దర్గా నుండి, పాత గుంతకల్లు మస్తానయ్య దర్గా వరకు రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగన్​ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.