ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవడం రాష్ట్రానికి తలవంపులు కాదా అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఫోన్ నెంబర్లు ఇచ్చి విదేశాలకు వెళ్లాలని కోర్టులే మన సీఎంను ఆదేశించాల్సి రావడం ఏపీకి అప్రతిష్ట కాదా అని నిలదీశారు. విజయసాయి రెడ్డిని రెండు లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి విదేశాలకు వెళ్లాలని కోర్టు ఆదేశించిందని యనమల ఎద్దేవా చేశారు. ఇలాంటి వైకాపా నేతల నోటివెంట శ్రీరంగ నీతులు వినాల్సి వస్తోందని మండిపడ్డారు. వైకాపా బెదిరింపులకు రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని ...ఇప్పటికే 17 కియా అనుబంధ యూనిట్లు కర్ణాటక వైపు మళ్లుతున్నాయన్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి తెదేపా ఎంత మంచి పేరు తెచ్చిందో వైకాపా అంత చెడగొట్టిందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి