రాష్ట్రంలో పలుచోట్ల విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తానేటి వనిత, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సథరన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం త్వరలో జిల్లాస్థాయి నుంచి అన్ని నియోజకవర్గాల్లోని ఆసుపత్రుల్లో ధ్రువపత్రాలు జారీచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కడప కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రపంచదివ్యాంగుల దినోత్సవంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పాల్గొన్నారు. వికలాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. దెందులూరులో జరిగిన కార్యక్రమంలో షిరిడిసాయి సత్సంగం వారు దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ఇందిరమ్మ అనే మహిళ పాఠశాలకు రూ.50,000 అందజేశారు. విశాఖ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులు తమ సమస్యలను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది.