.
పింఛన్లు ఎందుకు తొలగించారు.. బొత్సను నిలదీసిన మహిళలు - ఏపీలో కొత్త పింఛన్ న్యూస్
మేమంతా పేదోళ్లమయ్యా... మా పింఛన్లు, రేషన్‌కార్డులను అధికారులు తొలగించారంటూ పలువురు మహిళలు మంత్రి బొత్స సత్యనారాయణను నిలదీశారు. విజయవాడలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి మంత్రి బొత్స ప్రారంభించారు. అక్కడి రాజీవ్‌నగర్‌లో వృద్ధులు, మహిళలు బొత్స దగ్గరకు చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. బొత్స స్పందిస్తూ కార్డులు, పింఛన్లను తొలగిస్తున్నట్లు కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు.
minister bosta satyanarayana
.