విజయవాడలో రాష్ట్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజధాని మహిళా రైతులపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారి పట్ల ముఖ్యమంత్రి రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్న పిల్లలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో పెడుతుంటే మహిళా హోంమంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసులు ఎత్తివేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. వివిధ పార్టీల మహిళా నేతలు, అమరావతిలోని మహిళా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్యం వ్యవహరిస్తోంది. రాజధానిని మూడు ముక్కలు చేసి ముఖ్యమంత్రి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అన్యాయాన్ని ఎదిరించిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. దీన్ని ప్రశ్నించేవారు లేరని జగన్ అనుకోవటం సిగ్గుచేటు" -పెన్మత్స దుర్గా భవాని, రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చదవండి: 'సాగునీటి రంగాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది'