మహిళలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ... అత్యాచార వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో మహిళలు, వెనుకబడిన వర్గాలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న అరాచకాలకు ముఖ్యమంత్రి జగన్ జై కొడుతున్నారని.. ఏపీలో దిశ చట్టం దశా దిశా లేకుండా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దాడులకు దిగుతున్నారు..
అధికార పార్టీకి చెందిన నేతలే వెనుకబడిన వర్గాలపై దాడికి దిగుతున్నారని రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్న పిల్లలపై దాడులు జరుగుతుంటే మహిళ అయిన హోంమంత్రి మౌనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డుకట్టు వేయాలి..
ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. కార్యక్రమంలో వెనుకబడిన వర్గాలు, మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.