కొవిడ్ సమయంలో మహిళా వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి.. ఇంటర్నెషనల్ జస్టిస్ మిషన్తో కలిసి వెబ్నార్ నిర్వహించారు. మహిళా వలస కూలీల అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మహిళలకు స్థానిక అవసరాలకు తగ్గట్లుగా.. ఉపాధి పనుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
మహిళా కూలీల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అక్రమరవాణా చేయకుండా చర్యలు చేపడుతుమని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న మహిళలను రక్షించేందుకు మహిళా కమిషన్ పలు చర్యలు చేపట్టిందని వివరించారు.
ఇదీ చదవండి: కార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆ మూడు జిల్లాల్లోనే అధికం