తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై మంగళగిరిలో మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన యలమంచిలి పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పద్మజను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఆమెకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు కార్యకర్తలతో సహా చేరుకున్నారు. కొడాలి నానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సామాన్య మహిళను ఇలా స్టేషన్‌కు తరలించడం సమంజసం కాదని సౌమ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్, కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు