కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి ఇతర మండలాల నుంచి మద్యం ప్రియులు తరలి వస్తున్నారు. అవనిగడ్డ, కోడూరు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు కావటంతో... ఆయా ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. దీంతో ఆ ప్రాంతాల మందుబాబులు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి గ్రామానికి తరలివస్తున్నారు. వందలాది మంది మద్యం దుకాణం ముందు బారులు తీరుతున్నారు. వీరిలో కొందరు మాస్కులు సైతం ధరించకుండా... భౌతిక దూరం పాటించకపోవటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు కంటైన్మెంట్ జోన్ల నుంచి వస్తుండటంతో... స్థానికులు అభ్యంతరం చెప్పగా వారితో సైతం వాగ్వాదానికి దిగుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఘనంగా ఎమ్మెల్యే రమేష్‌బాబు పుట్టినరోజు వేడుకలు