ఇదీ చూడండి
నందిగామలో గంజాయి విక్రయిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్టు - weed handover at krishna dst nadigama
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు 5 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు
కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వీరిలో ఎక్కవ శాతం ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నారని పోలీసులు అంటున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 5 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. జిల్లాలో గంజాయి రాకెట్‌ను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి
sample description
Last Updated : Dec 13, 2019, 3:51 PM IST