కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం ఘటనపై నందిగామ డీఎస్పీ రమణమూర్తి స్పందించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మీడియా సమావేశంలో చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముందే ఆలయ అధికారులకు సూచించామని చెప్పారు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. విలువైన సంపద ఉన్న అన్ని ఆలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయిలోని ఆలయాల రక్షణకు రాత్రి వేళల్లో యువకులతో గస్తీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
'నంది విగ్రహం ధ్వంసం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటాం' - krishna district crime news
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నందిగామ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
!['నంది విగ్రహం ధ్వంసం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటాం' nadigama dsp dsp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8834876-228-8834876-1600340333564.jpg?imwidth=3840)