పౌరుల నుంచి ఆన్లైన్లో పన్నులు కట్టించుకోవడంతో విజయవాడ నగరపాలకసంస్థ విఫలమైందని నగరవాసులు ఆరోపించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గంటలు తరబడి లైన్లలో నిలబడటం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం ఉందని పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక దూరం పాటించేందుకు అనువుగా లేని ఇరుకు ప్రదేశాల్లో గంటల తరబడి నిలబడి, పన్నులు కట్టడం ప్రాణసంకటంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. రద్దీని బట్టి కౌంటర్లు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ చెల్లింపులు చేయడంలో ఉన్న సాంకేతిక సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీచదవండి.