ETV Bharat / state

ఒక రోజు పోలీసు కస్టడీకి మహేష్ హత్యకేసులో నిందితులు - Vijayawada Police Commissionerate News

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్య కేసులో నిందితులు సాకేత్ రెడ్డి ,గంగాధర్​ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మద్యం మత్తులో మహేష్​ని సాకేత్ రెడ్డి హత్య చేశాడని పోలీసులు ఇప్పటికే వెల్లండించారు. అయితే ఈ కేసులో ఇంకా కొన్ని విషయాలు మిస్టరీగానే ఉన్నాయి. వాటిని ఛేదించేందుకు నిందితులను విచారిస్తున్నారు.

మహేష్ హత్యకేసులో నిందితులకు ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతి

author img

By

Published : Nov 5, 2020, 1:26 PM IST

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్య కేసులో మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులను వారం రోజుల కస్టడీకి పోలీసులు కోరగా కోర్టు ఒక్క రోజు కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం నున్న పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు విచారించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.

నిందితుడు సాకేత్‌ ఓ వక్తిని కిడ్నాప్ చేసేందుకు నగరానికి వచ్చాడని విచారణలో వెల్లడి కాగా అందుకు సంబంధించిన వివరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులు చెప్పిన వ్యక్తి ఉన్నప్పటికీ, కిడ్నాప్‌కు పథకం వేశారా, లేదా అనే విషయాలు తేలాల్సి ఉంది. సాకేత్ రెడ్డి పిస్టల్‌తో తిరుగుతున్నప్పటికీ గుర్తించలేకపోవడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులకు ఎవరైనా సహకరిస్తున్నారా, అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ...వసతిగృహాలు తెరవొచ్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.