భవానీ దీక్షలకు ఇంద్రకీలాద్రి సన్నద్ధమైంది. జగన్మాత కరుణా కటాక్షాలను కోరుతూ భారీ సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలు చేపడుతుంటారు. రేపటి నుంచి విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో దీక్షలు ప్రారంభమవుతున్నట్లు దుర్గ గుడి ఈవో సురేష్ బాబు వెల్లడించారు. డిసెంబర్ 12 వరకు భవానీల సందడి కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అర్థమండలి దీక్షలు తీసుకునే అవకాశం కల్పించినట్లు ఈవో తెలిపారు. వచ్చే నెల 11న సత్యనారాయణపురం శివరామక్షేత్రం నుంచి కలశ జ్యోతి మహోత్సవం జరగనుందన్నారు. రాత్రి 11గంటల లోపల ఆలయానికి చేరుకునే విధంగా భక్తులు కలశజ్యోతులను తీసుకురావాలని ఈవో స్పష్టం చేశారు. అదేవిధంగా డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు భవానీల దీక్ష విరమణ ఉంటుందని.. డిసెంబర్ 22న పూర్ణాహుతితో కార్యక్రమం పరిసమాప్తమవుతుందని వివరించారు.
ఇదీ చూడండి: