అంబేడ్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బాబాసాహెబ్ 128వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందేలా చేశారని సీపీ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి- 'రఫేల్ ఒప్పందం నచ్చకే పారికర్ రాజీనామా'