ETV Bharat / state

ప్రజారోగ్య విభాగానికి అవినీతి జబ్బు

author img

By

Published : Dec 4, 2020, 2:22 PM IST

విజయవాడ కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య విభాగంలో అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కార్మికులకు సంబంధించిన బిల్లులు తయారీ మొదలు, జీతాల బిల్లులు ట్రెజరీకి పంపడం, సిబ్బంది అంతర్గత సర్దుబాట్ల వరకు ఇక్కడి అధికారులు, గుమాస్తాలకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పాల్సిందే. ఏళ్లుగా ఇదే పరిస్థితి సాగుతున్నా ఏ స్థాయిలోనూ నిలువరించ లేకపోతున్నారు. కొందరు అధికారులకు సైతం మామూళ్లు అందుతుండడంతో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Corruption Public Health Department
ప్రజారోగ్య విభాగంలో అవినీతి

విజయవాడ నగరపాలక సంస్థలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే మహిళా కార్మికురాలు ఒకరు ఇటీవల కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో విధులకు హాజరు కాలేదు. ఆపై విధుల్లో చేరేందుకు యత్నించగా, ప్రజారోగ్య విభాగం సెక్షన్‌ గుమాస్తా ఆమ్యామ్యాలు దండుకోవడంతో పాటు, లైంగిక వేధింపులకు పాల్పడడంతో విషయం కమిషనర్‌ వరకు చేరింది. విచారణలో వాస్తవాలు వెలుగు చూడడంతో గుమస్తాపై సస్పెన్షన్‌ వేటు పడింది.

అదే విభాగంలోని పర్యవేక్షక అధికారి ఒకరు పొరుగుసేవల, ఒప్పంద సిబ్బంది సరఫరాలో గుత్తేదార్లకు కొమ్ముకాస్తూ మస్తర్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

మస్తర్లలో మాయాజాలం

శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై ప్రజారోగ్య విభాగం అధికారుల పర్యవేక్షణ లోపంతో పలు డివిజన్లలో ఇప్పటికీ మస్తరు వేయడంలో మాయాజాలం కొనసాగుతోంది. కొంతమంది పీహెచ్‌ వర్కర్ల నుంచి వేల రూపాయలు దండుకుంటూ.. మస్తరు అయ్యాక వారిని ఇంటికి పంపేస్తున్నారు. కొంతమంది కార్మికులు తమకు బదులు ప్రైవేటు వ్యక్తులను పనిలోకి పంపేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ల నెలకు ఇంతని ముట్టజెబుతున్నారు. డ్వాక్వా, సీఎంఈవై గ్రూపుల సిబ్బంది మస్తరు అయ్యాక రోజుకు రూ.300 చొప్పున వీళ్లకు ఇస్తే ఇంటికి వెళ్లిపోయేలా చేస్తున్నారు.

బాధ్యతల అప్పగింతలో అక్రమాలు..

తాజాగా అనేక మంది సిబ్బందికి ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించారు. వాటిల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వులు 43 ప్రకారం కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి.. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ శిక్షణ పొందిన వారికి మాత్రమే బాధ్యతలు అప్పగించాలి. ప్రస్తుతం ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించని వారిని కూడా ఆ పోస్టులో వేశారు.

బిల్లులు.. చేతికి చిల్లులు

సిబ్బంది బకాయి బిల్లులు, ప్రయోజనాలు బిల్లులు, ఉద్యోగ విరమణ అనంతరం చెల్లింపులకు సంబంధించి ఇక్కడి గుమాస్తాల చేతులు తడపాల్సిందే. రూ.కోట్ల విలువైన బకాయి బిల్లులు సైతం ఇప్పటికీ అనేకం పరిష్కరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కాసులు ముట్టజెప్పిన వారి బిల్లులు మాత్రం ముందుగానే సిద్ధం అవుతున్నాయి.

కారుణ్య నియామకాల్లో కరుణే లేదు

ప్రజారోగ్య ఉద్యోగులు, సిబ్బంది మరణించిన అనంతరం జరిగే కారుణ్య నియామకాల విషయంలోనూ ఇక్కడి గుమాస్తాలు ఏ మాత్రం కరుణ చూపడం లేదు. కుటుంబ సభ్యులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే పలు రకాల పత్రాలు లేవని, ఫ్యామిలీ సర్టిఫికెట్లు సక్రమంగా లేవని నెలలు, ఏళ్ల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇటువంటి వారి విషయంలో కమిషనర్‌, ఉన్నతాధికారులు పలుసార్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది.

ఇవీ చూడండి:

పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.